టీవీ5 ప్రసారాలతో.. పరిష్కారమైన కాకుమాను గ్రామ సమస్య

tv5

ఆ ఊరు దాటాలంటే ఏరు దాటే సాహసం చేయాలంటూ.. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని చిన్నకాకుమాను గ్రామంపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రతిరోజూ వాగు దాటుతూ.. ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులపై ప్రభుత్వం స్పందించింది. గ్రామస్తుల కోసం ఓ తాత్కాలిక బల్లకట్టు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ కష్టాలు తెలిసేలా కథనాన్ని ప్రసారం చేసిన టీవీ 5కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాలోని కాకుమాను మండలంలో ఈ చిన్నకాకుమాను గ్రామం ఉంది. మండల కేంద్రం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. మౌలిక సౌకర్యాలేవి కనిపించవు. 25 కిలోమీటర్లు మట్టిరోడ్డులో వెళ్లలేని పరిస్థితుల్లో గ్రామస్తులకున్న ఏకైక మార్గం.. ఈ కాలువ ఒక్కటే. వాగు దాటకపోతే పూటగడవని పరిస్థితి. ఇలా ప్రాణాలతో చెలగాటమాడితేనే ఊరు దాటుతారు. వర్షాలు పడి వాగు పొంగినపుడు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక విష సర్పాలు కూడా బుస్‌ మంటూ జనాల్ని హడలెత్తిస్తుంటాయి.

ప్రమాదకర పరిస్థితుల్లో గ్రామస్తుల ప్రయాణంపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించి బల్లకట్టు ఏర్పాటు చేసింది. దీంతో వీరుకున్న అతిపెద్ద సమస్య తీరినట్టయింది.

TV5 News

Next Post

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ

Fri Nov 15 , 2019
TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన అంశమూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్లమెంటరీ పక్షనేత కే.కేశవరావు అధ్యక్షత వహిస్తున్నారు.. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేసీఆర్‌ […]