ఆ హీరో.. హీరోయిన్ పెళ్లి చేసుకుంటే నాకు..

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు అని బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆనందంగా చెబుతోంది రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్‌ల పెళ్లి గురించి. రణ్‌బీర్‌కు కరీనా వరుసకు సోదరి అవుతుంది. ముంబయలోని ‘జియో మామి మూవీ మేలా’ వేడుకలకు కరీనాతో పాటు దీపికా పదుకొణె, ఆలియా, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. వారి సరదా సంభాషణలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ముచ్చట వచ్చింది. ఈ విషయంపై కరీనా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కరీనాకు మరదలు అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా అని ఆలియాను అడిగితే అసలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. మరి పెళ్లయిన తరువాత హీరోయిన్‌గా కొనసాగుతారా అంటే.. నాయికలకు పెళ్లి తరువాత కెరీర్ జీరో అనే అపోహలను బద్దలు కొట్టేసింది కరీనా.. ఆమే మాలాంటి వాళ్లకు స్ఫూర్తి అని ఆలియా చెప్పింది. తాను నటించిన కళంక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడగా.. ఆ సమయంలో రణ్‌బీర్ తనకు చాలా సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. నటించిన సినిమాలన్నీ హిట్టవ్వవు. అలా అని మన ప్రయత్నం ఆపకూడదు. మరో మంచి పాత్ర వచ్చినప్పుడు ప్రతిభను నిరూపించుకోవాలి అని రణ్‌బీర్ ధైర్యం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది ఆలియా.

TV5 News

Next Post

ఫస్ట్ మార్క్ వచ్చిన స్టూడెంట్‌లా అమ్మ: నానీ

Tue Oct 15 , 2019
అమ్మ పుట్టిన రోజు అక్టోబర్ 14. ఆరోజు ఫోటోకి ఫోజివ్వమ్మా అంటే కొత్త బట్టలు వేసుకున్న చిన్న పిల్లలా అమ్మ బిగుసుకుపోయింది. యూనిట్‌ టెస్ట్‌లో ఫస్ట్ మార్క్ వచ్చిన విద్యార్ధిలా వినయంగా నిల్చుంది. 30 ఏళ్లుగా ఫార్మాసిస్ట్‌గా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసింది అమ్మ అంటూ ఏడాది క్రితం రిటైర్మెంట్ రోజు అమ్మతో కలిసి దిగిన ఫోటోని నేచురల్ స్టార్ నానీ అభిమానుల కోసం షేర్ చేశారు. అమ్మ […]