సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం

కాంగ్రెస్ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని హస్తం నాయకత్వం రద్దు చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌లను మాత్రం కొనసాగించారు. మిగతా పదవులన్నింటినీ రద్దు చేశారు. కర్ణాకటలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మరిది మీద వాంఛతో దారుణానికి ఒడిగట్టిన మహిళ

Wed Jun 19 , 2019
బరితెగించిన కామం ఆమె కళ్లు మూసింది. కొడుకులాంటి మరిదిపై ఆమె పెంచుకున్న ప్రేమ పగగా మారి హత్యకు దారితీసింది. దీంతో ఓ మానసిక వికలాంగురాలు ప్రాణం పోయింది. విజయవాడ సనత్ నగర్ కు చెందిన ముంతాజ్, ఖలీల్ వదిన – మరిది వరస అవుతారు. అతనికి పదేళ్లు ఉన్నప్పుడు ముంతాజ్ ఖలీల్ అన్నను పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల తర్వత ఖలీల్ ను లోబర్చుకుంది ముంతాజ్. కొన్నేళ్ల పాటు ఈ […]