నా స్నేహితులను కలుసుకునేందుకు వచ్చాను: డీకే శివకుమార్

కర్ణాటకలో స్పీకర్‌ నిర్ణయంతో కాస్త ఉపశమం కల్గిందని భావించినా… సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతునే ఉంది. ముంబైలో రెబల్‌ ఎమ్మెల్యేను బుజ్జిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌ – జేడీఎస్‌. ఇందుకోసం కర్ణాటక మంత్రి డికే శివకుమార్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ…. ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేస్తోన్న హోటల్‌ వద్దకు చేరుకున్నారు. అయితే… వీరిద్దరిని అడ్డుకున్నారు పోలీసులు. లోపల్నికి వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే తాను తన స్నేహితులను కలుసుకునేందుకు వచ్చానన్నారు డికే శివకుమార్‌.

రెబల్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తమను కలిసేందుకు వచ్చే నేతలనుంచి రక్షణ కల్పించాలంటూ… లేఖలో కోరారు. దీంతో హోటల్‌ వద్ద భారీగా పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హోటల్‌లో ఎవ్వరిని అనుమతించడం లేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Wed Jul 10 , 2019
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన స్పీకర్‌ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 14 పని దినాలపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు […]