మామా కోడలి సంబంధం.. అది చూసి భర్త ఇద్దరినీ..

Read Time:0 Second

కోరిక తీరితే చాలు.. వావి వరుసలు, మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలు బలిచేసుకుంటున్నారు. మామ తండ్రితో సమానమంటారు. అయినా కోడలిపట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కోర్కెలు తీర్చుకోవడమే పరమావధిగా చాటు మాటు వ్యవహారాలు సాగించాడు. దానికి కోడలు కూడా వంత పాడింది. మామ చేసే ప్రతి చర్యను సమర్థించింది. కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, భార్య రేణుక, తండ్రి మాళప్పతో కలిసి ఉంటున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం పుట్టప్ప రోజూ ఉదయం వెళ్లి సాయింత్రానికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో భర్త పని మీద పొరుగూరు వెళితే రేణుక మామతో రాసలీలలు నెరిపింది.

ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తమ సాంగత్యాన్ని కొనసాగించారు. ఉదయం వెళ్లి సాయింత్రం వచ్చే భర్తకు ఇసుమంతైనా అనుమానం రాకుండా మసలుకున్నారు. కానీ ఆ అక్రమ సంబంధం ఎంతో కాలం సాగలేదు. ఓ రోజు పనిమీద వెళ్ళిన భర్త మధ్యాహ్నానికే ఇంటికి చేరుకున్నాడు. పడక గదిలో ఉన్న తండ్రిని, భార్యని అసభ్యకరంగా చూసిన అతడికి కోపం కట్టలు తెంచుకుంది. ఇద్దరిపై కత్తితో వేటు వేశాడు. తీవ్ర రక్త స్రావంతో రేణుక, మాళప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పుట్టప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close