ఓ అందమైన అమ్మాయి డేటింగ్ యాప్‌లో..

ఓ అందమైన అమ్మాయి అమాయకంగా ముఖం పెట్టి వలపు వల విసిరేసరికి అబ్బాయిల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అందంతో పాటు తెలివితేటలు కూడా అమోఘంగా ఉన్న అమ్మాయి టెక్నాలజీని తెగ వాడేస్తుంటుంది. ఓ డేటింగ్ యాప్‌తో ప్రయోగాలు చేస్తుంటుంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కబీర్‌సింగ్ చిత్రంలో కాలేజీ అమ్మాయి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కియారా ఇందూ కీ జవానీ‌లో కాస్త డిఫరెంట్‌గా కనిపించనుంది. అభిర్ సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ లఖ్‌నవులో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం పంచుకొంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటించిన ఆదిత్య సీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందూది ప్రేమించే మనసు.. చాలా తెలివైనది.. అన్నిటికంటే ఆమె చాలా విచిత్రమైంది. అదేంటో తెరపైనే చూడాలి అని అంటోంది కియారా. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

TV5 News

Next Post

భారీ అధిక్యంతో సైదిరెడ్డి విజయం ఖాయం..

Thu Oct 24 , 2019
హుజూర్‌నగర్‌లో కారు టాప్‌గేరులో దూసుకెళ్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే గులాబీ గుబాళింపులు మొదలయ్యాయి. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈ జోరు చూస్తుంటే..హుజూర్‌నగర్ ఓటర్లంతా ఏకపక్షంగా ప్రభుత్వం వైపే నిలబడినట్లు స్పష్టం అవుతోంది. 14వ రౌండు ముగిసే సరికి దాదాపు 27 వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉంది టీఆర్ఎస్. ఈ ట్రెండ్ చూస్తుంటే సైదిరెడ్డి భారీ అధిక్యంతో విజయం సాధించడం దాదాపు […]