రాయలసీమలో కృష్ణమ్మ సందడి.. గండికోట జలాశయానికి కృష్ణా జలాలు

రాయలసీమలో కృష్ణమ్మ సందడి చేస్తోంది. కడప-అనంతపురం జిల్లాల వరప్రదాయని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి.. అవుకు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గండికోటకు నీటిని విడుదల చేశారు..ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు. అయితే ముంపువాసులకు పరిహారం ఇంకా అసంపూర్తిగా ఉండిపోవడంతో కేవలం 12 టీఎంసీలు మాత్రమే నిల్వచేసేందుకు అస్కారం ఉంది. గండికోటలోకి దాదాపు 4 టీఎంసీల నీరు చేరిన తర్వాత.. మైలవరం, పైడిపాలెం జలాశయాలకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పది రోజుల్లోనే నిండిపోయిన శ్రీశైలం జలాశయం

Thu Aug 22 , 2019
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రస్తుతం జురాల నుంచి 14 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 30 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.50 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దాదాపు 70వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండు […]