స్కూల్లో 130 మంది పిల్లలు.. సార్ మాత్రం లేరు

Read Time:0 Second

ఆ ప్రభుత్వ స్కూల్లో 130 మంది పిల్లలు ఉన్నారు. కానీ సార్ మాత్రం లేరు. పిల్లలు స్కూలుకు వస్తారు. ఆటలాడతారు. తిరిగి ఇంటికి వెళ్తారు. కానీ వారికి చదువు చెప్పే ఉపాధ్యాయులు మాత్రం రారు. అంతే కాదు విద్యార్థులకు వంటలు వండి అన్నం పెట్టే నిర్వాహకుడే ఆ స్కూల్‌ ఉపాధ్యాయుడుగా మారిపోయాడు. ఇది కర్నూలు జిల్లా ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి అద్దం పడుతోంది.

కర్నూలు జిల్లా కర్నాటక సరిహద్దు అయిన హలహర్వి మండలం సిద్ధపురం ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా.. ఇటీవలే ఓ టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. దీంతో అది ఏకోపాధ్యాయ పాఠశాలగా మారింది. ఉన్న ఒక్క మాస్టారు సెలవుపై వెళ్లడంతో విద్యార్థులకు చదువు చెప్పే వారే కరువయ్యారు.

ఇక వంటే నిర్వాహకుడే ఉపాధ్యాయుడిగా అవతారం ఎత్తాడు. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కు ఉపాధ్యాయులను నియమించకుండా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close