ఆ వినాయకుడిని చూడటానికి కోటిమంది భక్తులు..

Read Time:0 Second

లాల్‌బాగ్‌ గణేషుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఎంత సమయమైనా.. క్యూ లైన్లు ఎన్ని కిలోమీటర్లు దాటినా సరే… బొజ్జ గణపయ్య దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తుంటారు. విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటారు.

ఇక ముంబైలో అన్ని విగ్రహాల కంటే లాల్‌బాగ్‌ వినాయకుడి విగ్రహమే ఎత్తయినది. సింహాసనంపై ఆసీనుడైన లాల్‌బాగ్‌ లంబోదరుడు.. తన రూపంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమా ఆర్ట్ డైరెక్టర్లు రూపొందించే గణేషుడి మండపం కూడా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా మారింది. ఈ సారి చంద్రయాన్‌-2, అంతరిక్షాన్ని ప్రతిబింభించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్‌, లేజర్‌ లైటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

1934 నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు లాల్‌బాగ్‌ వినాయకుడు. లాల్‌బాగ్‌ రాజా సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ ఏటా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంది. ఇక గణేష్ విగ్రహ రూపకల్పన బాధ్యతను గత ఎనిమిది దశాబ్దాలుగా కాంబ్లీ కుటుంబమే చూస్తోంది. లాల్‌బాగ్ గణేష్.. భారతదేశంలో ఎత్తయిన వినాయక విగ్రహాలలో ఒకటి. అతి పురాతన, ప్రతిష్టాత్మక మండల్‌లలో ఒకటైన లాల్‌బాగ్ చా మహారాజ్‌ను దర్శించడానికి కేవలం ముంబై చుట్టు పక్కల నుంచే దాదాపు కోటి మంది భక్తులు వస్తారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close