నిద్రపోతున్న అమ్మా నాన్న.. 12 ఏళ్ల కూతురు క్యాబ్ బుక్ చేసి..

నిద్రపోతున్న అమ్మా నాన్న.. 12 ఏళ్ల కూతురు క్యాబ్ బుక్ చేసి..

మానసిక స్థితి సరిగా లేని ఓ బాలిక 9 అంతస్థుల మేడ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన బెనిటా డైమండ్ అనే 12 ఏళ్ల బాలిక అమ్మా నాన్న పడుకున్నాక అర్థరాత్రి 12 గంటల సమయంలో అమ్మ ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేసింది. అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పార్కింగ్ గ్యారెజ్‌కి వెళ్లింది. తొమ్మిది ఫ్లోర్లు కలిగిన గ్యారేజ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకేసింది. తెల్లారి లేచి బెనిటాని వెతుక్కున తల్లికి ఈ వార్త చేరింది. సమాచారం అందుకున్న పోలీసులకు వారి ఎంక్వైరీలో క్యాబ్ బుక్ చేసి వెళ్లినట్లు తెలుసుకున్నారు. బెనిటా తల్లి లీషా చెన్.. ఊబెర్ సంస్థను ప్రశ్నిస్తోంది.

12 ఏళ్ల అమ్మాయి క్యాబ్ బుక్ చేస్తే ఎలా ఎక్కించుకున్నారని అడుగుతోంది. ఆమె బుక్ చేసిన ప్రదేశంలో స్కూల్ కానీ, పిల్లలకు సంబంధించిన ప్రదేశం కూడా కాదని అంటోంది. మరి అలాంటప్పుడు క్యాబ్ డ్రైవర్ ఆమెని నిలదీసి ఇంట్లోని పెద్ద వారికి సమాచారం అందించి ఉంటే నా కూతురు బతికేది అని ఆవేదన చెందుతోంది. ఊబెర్ వెబ్‌సైట్‌లో కూడా అలానే ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారి బుకింగ్స్‌ని మాత్రమే తీసుకోవాలని.. తక్కువ వయసున్న వారు ఖచ్చితంగా పెద్ద వారితో కలిసే ప్రయాణించాలని ఉంటుంది. తన కూతురు మానసిక స్థితి సరిగాలేని కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తల్లి కన్నీరు మున్నీరవుతోంది. కూతురి ఫోన్‌కి లాక్ చేయడంతో తన ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేసిందని తల్లి వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story