ఎక్కడైనా విన్నారా కారం నీళ్లతో అభిషేకం.. అది కూడా దేవుడికి కాదు పూజారికి..

భారతదేశంలో ఎన్నో ఆలయాలు మరెన్నో సంప్రదాయాలు.. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు.. పరిశోధకులకు సైతం అంతు చిక్కని రహస్యాలు.
అదేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు.. కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తున్నారు ఓ పూజారికి. అభిషేకం అంటే పంచామృతాలు.. పాలతో కదా చేసేది అంటే ఇది ఈ ఆలయ ఆచారం అంటున్నారు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో ఆడి అమావాస్య సందర్భంగా కరుప్పుస్వామి ఆలయంలో ఇటువంటి వింత ఆచారం కొనసాగుతోంది. ఆరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడికి కారం పొడి కలిపిన నీటితో అభిషేకం చేస్తారు.

ఇందుకోసం 75 కిలోల ఎండుమిరపకాయలను దంచి కారం పొడిని తయారు చేస్తారు. దాంట్లో నీటిని కలిపి భక్తులు అందరూ చూస్తుండగా బిందెల కొద్దీ కారం నీళ్లతో ఆలయ అర్చకుడిని అభిషేకిస్తారు. భక్తులు ఆసక్తిగా అభిషేక ఘట్టాన్ని తిలకిస్తారు. అభిషేకానంతరం అర్చకుడు చెప్పే ఉపదేశాన్ని భక్తి శ్ర్ధద్ధలతో వింటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని ఆలయ అర్చకులు వివరిస్తుంటారు. మాములుగా ఒంటికి కొంచెం కారం తగిలితేనే మంటపుట్టి గగ్గోలు పెడతారు. కానీ బిందెల కొద్దీ కారం నీళ్లు పూజారి మీద పడుతున్నా కించిత్ మనకుండా కూర్చుంటారు. పైగా వారికి మంట కూడా పుట్టదట. అదంతా కురుప్పు స్వామి మహత్యమని నమ్ముతారు భక్తులతో పాటు ఆలయ అర్చకులు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *