పెట్రోలు బంకుల్లో ఇంత మోసమా..!

పెట్రోలు బంకుల్లో ఇంత మోసమా..!

ఈ రోజుల్లో మనం ఏది కొన్న అంతా కల్తీయే.. మనం రోజు ఉపయోగించే నిత్యావసర వస్తువులు కల్తీగానే ఉంటున్నాయి. కల్తీతో పాటు తూనికల్లో తేడా చేస్తూ వ్యాపారస్థులు వినియోగదారులు మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు సర్వసాధారణమైపోయాయి. లీటరు పెట్రోలుకు కనీసం 100 మిల్లీలీటర్లు తేడైనా వస్తోందని.. తూనికలు కొలతలు శాఖ దాడుల్లో అనేక సార్లు బయటపడింది. అంతేకాకుండా కొన్ని బంకుల్లో కల్తీ కూడా జరుగుతున్నట్లు వినియోగదారులు నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన అధికారుల మాత్రం పట్టించుకోకుండా ఉండడంతో అంతిమంగా వినియోగదారులే నష్టపోతున్నారు. నాఫ్తాతో పెట్రోల్‌ను కల్తీ చేసి బంకు యజమానులు జేబులు నింపుకుంటున్నారు. అలాగే పెట్రోల్‌లో కిరోసిన్‌, ఇతరత్రా వాటిని కలిపి కల్తీ చేస్తున్నారు, ఇంధనంలో కల్తీ ఉంటే వాహనాలు మొరాయిస్తుంటాయి. దీంతో వాటి లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇంధనం కల్తీ వల్లే వాహనాలు పాడవుతున్నా ఫిర్యాదు చేయలేని స్థితిలో చాలామంది వాహన యజమానులు ఉన్నారు. కావున అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వినియోగదారులు

కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story