సారీ.. తప్పయిపోయింది: యాంకర్ రవి

సారీ.. తప్పయిపోయింది: యాంకర్ రవి

సందర్భానుసారంగా సెటైర్లు వెయ్యాలి. నొప్పించక తానొవ్వక మాట్లాడాలి. ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. కాకపోతే ఓ యాంకర్‌గా టీవీ షో వ్యాఖ్యాతగా ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓ సెలబ్రెటీగా తమని చూస్తున్న ప్రేక్షకులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయకూడదు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే వారు కూడా బుద్ది చెబుతారు. ఆల్డ్రెడీ ఒక సారి ఇలానే నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు యాంకర్ రవి. తాజాగా మరోసారి. ఆనక ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం.. దానికి యాంకర్ రవి సపోర్ట్ చేయడంతో వివాదం మొదలైంది.

అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. వివాదం ముదరడంతో రవి స్వయంగా రంగంలోకి దిగి.. ఏపీ ప్రజలకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆరోజు జరిగింది తప్పే అని.. అయితే యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసే వారని వివరణ ఇచ్చుకున్నాడు. తనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలన్నా, ముఖ్యమంత్రులన్నా అభిమానమని చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు.

Tags

Read MoreRead Less
Next Story