కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరో బిగ్ షాక్..

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరో బిగ్ షాక్..

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి మరో బిగ్ షాక్. సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అప్పగించింది. చిదం బరాన్ని తమ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఆయన్ను 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వొద్దన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు, ఈ కేసులో చిదంబరం పాత్రపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

అంతకుముందు, సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా ఏర్పడింది. అకస్మాత్తుగా చిదంబరం మాట్లాడారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ చిదంబరం కొనసాగించారు. జడ్జి అనుమతితో తన వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి ముడుపులు తీసుకోలేదని చెప్పారు. 305 కోట్ల రూపాయల గురించి సీబీఐ అధికారులు తననెప్పుడూ అడగలేదన్నారు. తనతో పాటు తన కుమారునికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలను సీబీఐకి ఇచ్చానన్న చిదంబరం, తనకు విదేశాల్లో ఎలాంటి బ్యాంకు ఖాతాలు లేవన్నారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చానని చెప్పారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

చిదంబరం కస్టడీపై సీబీఐ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. INX మీడియా కేసులో పదేళ్ల తర్వాత FIR నమోదు చేశారని సిబల్ పేర్కొన్నా రు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. చిదంబ రాన్ని అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశారని, ఇక అడిగేదేమీ లేదన్నారు. ఈ కేసులో సహనిందితులందరూ బెయిల్‌పైనే ఉన్నారని, చిదంబరం కూడా ఎక్కడికి పారి పోవడం లేదని చెప్పారు. అసలు చిదంబరాన్ని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదన్నారు. బెయిల్ ఇవ్వడం చట్టబద్దమని, కస్టడీ కోరడం ప్రత్యామ్నాయం మాత్రమే అని వాదించారు. ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్‌గా మారడంపై ఘాటుగా స్పందించిన చిదంబరం లాయర్లు, FIPB అధికారులే నిర్ణయాధికారులని, అప్రూవర్లు కాదని వితండ వాదన చేశారు.

ఇక, సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. విచారణకు చిద్దూ సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. మౌనంగా ఉండడమో, జవాబులు దాటి వేయడమో చేస్తున్నారని తెలి పింది. గుచ్చి గుచ్చి అడిగినా కూడా పెదవి విప్పడం లేదని పేర్కొంది. ఈ కేసు చాలా తీవ్రమైందని, ప్రైవేటు కంపెనీలకు అనుచితంగా లబ్ది కలి గించా రని పేర్కొంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నా యని, మనీలాండరింగ్‌కు ఇది క్లాసిక్ ఎక్సాంపుల్ ‌అని అభివ ర్ణించింది. కేసు డైరీని కోర్టు కు సమర్పించిన సీబీఐ, INX మీడియా కంపెనీ నుంచి సుమారు 50 లక్షల డాలర్ల మేర ముడుపులు ముట్టాయని ఆరోపించింది. ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించడానికి ఇంకాస్త సమయం అవసరమన్న సీబీఐ, చిదంబరాన్ని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.

ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ తర్వాత చిదంబరాన్ని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు చిదంబరాన్ని తీసుకొచ్చారు. చిదంబరం భార్య నళిని, కుమారు డు కార్తీ కూడా కోర్టుకు వచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, ముకుల్ వాస్నిక్‌ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story