8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లైకి ఆఖరు ఈ నెల..

8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లైకి ఆఖరు ఈ నెల..

ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్-2019 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఖాళీల సంఖ్య: 8000..

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT).. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT).. ప్రైమరీ టీచర్ (PRT).. అర్హతలు: పీజీటీ పోస్టులకు పీజీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ ఉండాలి. టీజీటీ పోస్టులకు డిగ్రీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ ఉండాలి. పీఆర్‌టీ పోస్టులకు డిగ్రీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉండాలి. వయసు 01.04.2020 నాటికి ఫ్రెషర్స్ అయితే 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఢిల్లీ స్కూళ్లలో టీజీటీ/పీఆర్‌టీ పోస్టులకు 29 ఏళ్లలోపు, పీజీటీ పోస్టులకు 36 ఏళ్లలోపు ఉండాలి. అనుభవం వున్నవారు 57 సంవత్సరాలలోపు ఉండాలి. ఢిల్లీ స్కూళ్లకు సంబంధించి 40 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పరీక్ష ఫీజు రూ.500. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారానే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2019.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.09.2019.. పరీక్ష తేదీ: అక్టోబరు 19,20 తేదీల్లో.. ఫలితాల వెల్లడి: 30.10.2019.

Also Watch

Tags

Read MoreRead Less
Next Story