తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారింది – భట్టి విక్రమార్క

తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందన్నారు కాంగ్రెస్‌నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి.. కేంద్రం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పర్యటిస్తానన్నారు భట్టి. కాంగ్రెస్‌ పార్టీ తరపున మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌ తన రాజమహల్‌ నుంచి బయటకొచ్చి చూస్తే సమస్యలు తెలుస్తాయని విమర్శించారు . రాష్ట్రంలో విద్య, వైద్యం మాఫియా చేతుల్లో నడుస్తోందని ఫైరయ్యారు భట్టి విక్రమార్క.

Also Watch : 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *