పదవతరగతి అర్హతతో బీఆర్‌వోలో ఉద్యోగాలు..

పదవతరగతి అర్హతతో బీఆర్‌వోలో ఉద్యోగాలు..

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట, ఎలక్ట్రీషియన్, వెహికల మెకానిక్, మల్టీస్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసేందుకు అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఉండదు.
మొత్తం పోస్టులు: 778….డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్: 388….ఎలక్ట్రీషియన్ : 101….వెహికల్ మెకానిక్:92….మల్టీ స్కిల్డ్ వర్కర్: 197
అర్హత, వయసు: డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్: పదవతరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 సంవత్సరాల వయసు ఉండాలి.
ఎలక్ట్రీషియన్: పదవతరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికెట్ 27 సంవత్సరాల వయసు ఉండాలి.
వెహికల్ మెకానిక్: పదవతరగతితో పాటు మెకానిక్ సర్టిఫికెట్ 27 సంవత్సరాల వయసు ఉండాలి.
మల్టీ స్కిల్డ్ వర్కర్: పదవతరగతితో పాటు 25 సంవత్సరాల వయసు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంబంధిత అకౌంట్‌లో ఫీజు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అకౌంట్ వివరాలు: commandant, GREF centre, Pune 411015, Public Fund Account No.11182905409,SBI,Khadki Branch Pune Code No.01629
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా …ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్…చివరి తేదీ: 05.07.2019
చిరునామా: అకౌంట్ వివరాలు: commandant, GREF centre, Dighi camp, Pune 411015

Tags

Read MoreRead Less
Next Story