బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్ వచ్చేసింది..

ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ గురించి వినే ఉంటారు. ఆ తర్వాత ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చినప్పటికీ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ ఛాలెంచ్‌… బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్. వాటర్‌, వైన్‌, వోడ్కా ఇలా బాటిల్‌ ఏదైనా అత్యంత చాకచక్యంగా ఒక్క కిక్‌తో బాటిల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేయడమే బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్….

టైక్వాండో ఛాంపియన్‌ ఫాబ్రి డెవ్లెచిన్‌ ఈ బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ను వెలుగులోకి తెచ్చాడు. వరల్డ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ క్యాప్‌ ఓపెన్‌ చేసి అందరినీ షాక్‌ కు గురిచేశాడు. ఈ ఛాలెంజ్‌ ప్రయత్నించడానికి ముందు.. బాటిల్ క్యాప్‌ను కాస్త లూజ్‌ చేయాలి. అయితే బాటిల్‌కు కాలు తగలకుండా చేయడానికి కాస్త హార్డ్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌పోర్టర్‌ మూవీస్‌తో పాపులర్‌ అయిన హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జేసన్ స్టేథమ్ చేసిన బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా పాపులర్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన 23 సెకన్ల వీడియోకు 14.5 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి…

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా తనదైన శైలిలో బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ చేసి చూపించాడు… కోలీవుడ్‌ యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కూడా తాను తక్కువ కాదని ఛాలెంజ్‌ స్వీకరించాడు.. వరల్డ్‌ వైడ్‌గా బాగా పాపులర్‌ కావడంతో… చాలా మంది బాటిల్ క్యాప్‌ ఛాలెంజ్‌ టాలెంట్‌ చూపిస్తున్నారు.. ఓవైపు కొందరు సీరియస్‌గా బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ విసురుతుంటే… మరికొందరు ఈ ఛాలెంజ్‌తో కామెడీలు చేస్తున్నారు. సరదాగా సెటైరిక్‌గా బాటిల్‌ క్యాప్‌లు ఓపెన్ చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *