తెలంగాణ ప్రభుత్వ పనితీరును మరోసారి తప్పు పట్టిన కాగ్

తెలంగాణ ప్రభుత్వ పనితీరును మరోసారి కాగ్‌ తప్పు పట్టింది. ప్రభుత్వంలో జరుగుతున్న లోటు పాట్లు.. ప్రాజెక్టుల పురోగతిపై మొట్టి కాయలు వేసింది కాగ్. రెవెన్యూ రాబడితో పోల్చి చూస్తే వడ్డీ చెల్లింపులే అధికంగా ఉన్నయని కాగ్‌ సీరియస్‌ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర అప్పులు లక్షా 42 వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయని కాగ్ రిపోర్ట్ తేల్చింది. ఇందులో రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతం ఉందని.. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లింపుల శాతం భారీగా పెరుగుతుందని కాగ్ పేర్కొంది. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రం 65,740 కోట్ల రూపాయలు అప్పులుగా చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ లోటు 284.74 కోట్లు ఉంటే అందులో ద్రవ్య లోటు రూ.27,654 కోట్ల రూపాయలు ఉందని సూచించింది.

గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ నుంచి అప్పులపై ఆధారపడటం వల్ల వడ్డీల చెల్లింపులు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చులు చేస్తుందని.. ఫలితాలు ప్రకటించడం లేదని రిపోర్ట్‌లో సూచించింది. రాష్ట్రంలో నిర్మిస్తున్నా ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగింది. డిస్కమ్‌లు ఆర్థిక పునరుత్తేజం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన బకాయిలను విడుదల చేయాలని కాగ్ తెలిపింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story