మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెడకు కేసుల ఉచ్చు

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెడకు కేసుల ఉచ్చు

మొన్న..మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నిన్న..దళితులను అవమానించారనే దుమారంలో చిక్కుకున్న నన్నపనేని రాజకుమారి. లేటెస్ట్ గా కేసుల ఉచ్చు మాజీ మంత్రి సోమిరెడ్డి మెడకు కూడా చుట్టుకుంటోంది. కొన్నేళ్ల కిందటి వివాదం సోమిరెడ్డికి సవాల్ గా మారింది. ఆయన్ని అరెస్ట్ చేస్తారేమోననే ప్రచారం ఉత్కంఠను మరింత పెంచింది. జిల్లాలోని వెంకటాచలం మండలం పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎలూరు నాగిరెడ్డి అనే వ్యక్తికి చాన్నాళ్లుగా భూవివాదం నడుస్తోంది. వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబర్ 58/3లో ఉన్న రెండున్నర ఎకరాల భూమికి మాజీ మంత్రి సోమిరెడ్డి నకిలీ పత్రాలు సృష్టించారని ఎలూరు నాగిరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో FIR కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ సోమిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 14A కింద నోటీసులు ఇచ్చి PSకు రావాలన్నారు.

ఆనాటి భూవివాదానికి సంబంధించి శుక్రవారం వెంకటాచలం పీఎస్‌కు సాక్ష్యాలతో సహా వచ్చారు సోమిరెడ్డి. నిజానికి ఈ నెల తొమ్మిదినే భూముల వ్యవహారంపై స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉన్నా సోమిరెడ్డి గైర్హాజరయ్యారు. శుక్రవారం వెంకటాచలం పీఎస్‌లో హజరై భూమికి సంబంధించిన దస్తావేజులను అధికారులకు చూపించారు. భూమి హక్కులపై వివాదాలు కావాలనే సృష్టించారని, ఎవరి భూములు లాక్కోవాల్సిన అవసరం తనకు లేదని వివరించిన సోమిరెడ్డి.. ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం జరుగుతున్న కుట్ర అని అన్నారు.

అయితే..విచారణ తర్వాత సోమిరెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించారు. దీంతో వెంకటాచలం మండలం పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story