ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లపై సీఎం కేసీఆర్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మాదిరిగానే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలం పొలాలకు నీరందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లపై హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆన్‌ గోయింగ్ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుందని కేసీఆర్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లాగే, రేయింబవళ్లు, మూడు షిఫ్ట్‌ల్లో పని చేసి, పాలమూరు ఎత్తిపోతల పధకాలను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్ట్ పరిధిలో రిజర్వాయర్లు, పంప్‌ హౌజులు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని సూచించారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల్లో వేగం పెంచాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story