నాన్నకెంత కష్టం.. కూతురు శవాన్ని చేతులపై మోస్తూ..

నాన్నకెంత కష్టం.. కూతురు శవాన్ని చేతులపై మోస్తూ..

పేదరికానికి తోడు పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తే దేవుడి మీద భారం వేసి ప్రభుత్వాసుపత్రులకే వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ మంచి వైద్యం అందుతున్నా సౌకర్యాలు అంతంత మాత్రం. వెరసి రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతుంటాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన సంపత్ కుమార్తె గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించే స్థోమత లేని తండ్రి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూతురిని చూపిస్తున్నాడు. దురదృష్టవశాత్తు వ్యాధి తీవ్రత ఎక్కువకావడంతో చిన్నారి ఆరోగ్యం క్షీణించి మరణించింది.

మరణించిన బిడ్డను ఇంటికి తీసుకువెళ్లడానికి క్కూడా చేతిలో చిల్లి గవ్వలేదు తండ్రికి. దాంతో అతడు ఆసుపత్రి వారినే అంబులెన్స్ ఇవ్వమని అడిగాడు. కానీ అది పని చేయడం లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చేసేది ఏమీ లేక బిడ్డని చేతుల్లోకి తీసుకుని రోదిస్తూ ఆటో స్టాండ్ వరకు వెళ్లాడు. శవాన్ని ఆటోలో తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం.. మీ ఊరికి నేను తీసుకువెళతాను అంటూ ముందుకు వచ్చాడు. మానవత్వం చాటుకున్న ఆటోడ్రైవర్‌కి మనసులో కృతజ్ఞత చెప్పాడు సంపత్. విషయం తెలిసిన స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story