డేరా బాబాకి ఎంత మంది చెల్లెళ్లో.. కుప్పలు తెప్పలుగా రాఖీలు

డేరా బాబాకి ఎంత మంది చెల్లెళ్లో.. కుప్పలు తెప్పలుగా రాఖీలు

ఏనుగు చచ్చినా లక్షే.. బతికినా లక్షే అనే సామెత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకి కూడా వర్తిస్తుందేమో. అత్యాచార కేసులో జీవిత ఖైదుకి గురై.. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న బాబాకు రాఖీ పండుగని పుస్కరించుకుని నిజంగా నిజమైన చెల్లెళ్లు.. అన్న మీద ప్రే...మతో రాఖీలు పంపిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు, రాఖీ పండుగ ఒకే సారి వచ్చింది. దాంతో బాబాని విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డులు, అన్నపై అభిమానం కురిపిస్తూ చెల్లెళ్లు రాఖీలు పంపిస్తున్నారు. దీంతో పాపం పోస్టల్ సిబ్బందికి పని భారం ఎక్కువైంది. రోహ్‌తక్ పోస్టాఫీసుకు ఇప్పటిదాకా 7000 నుంచి 8000 వరకు ఉత్తరాలు అందినట్లు సమాచారం. రోజుకు 2వేల ఉత్తరాల వరకు బాబా పేరు మీద వస్తున్నాయని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. అసలే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల షార్టేజ్. అందులో ఈ ఉత్తరాలు ఒకటి. ప్రతి ఉత్తరాన్ని చదివి, డేటాబేస్‌‌లో చేర్చాలి. దాంతో సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. కేవలం పోస్టల్ సిబ్బందే కాదు.. జైలు అధికారులు కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారు. ప్రతి ఉత్తరాన్ని చదవలేక తలలు పట్టుకుంటున్నారట. ఓ జర్నలిస్టు హత్యతో పాటు ఇద్దరు మహిళా సాధ్విలపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో డేరాబాబా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story