ఘరానా మోసం.. తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని..

ఘరానా మోసం.. తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని..

తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఓ సంస్థ బాగోతం బట్టబయలైంది. బాధితుల ఆందోళనతో హిమాయత్‌ నగర్‌లోని తాజ్‌ ఫ్రైడ్‌ సర్వీస్‌ సంస్థ గుట్టురట్టు అయింది. ఓ ప్లాన్ ప్రకారం ఈ సంస్థ వినియోగదారులను మోసం చేసినట్టు తెలుస్తుంది. ముందుగా గిఫ్ట్ వచ్చిందని ఆశ చూపి ప్రజలను ఆఫీస్‌లకు రప్పిస్తారు. హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరలకే ప్లాట్లు లభిస్తాయని.. ఈ రోజే బుక్ చేసుకుంటే డిస్కౌంట్‌ ఇస్తామని ఆశ చూపి బురిడీ కొట్టిస్తారు. ఇలా సుమారు 50 మంది బాధితుల నుంచి 2 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. నెలలు గడిచినా ప్లాట్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు ఇదేమని ప్రశ్నిస్తే తిరిగి వారిపైనే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story