గుణ 369 మూవీ రివ్యూ

గుణ 369 మూవీ రివ్యూ

మూవీ : గుణ 369

తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ

మ్యూజిక్ : చైతన్‌ భరద్వాజ

డైరెక్టర్ : అర్జున్‌ జంధ్యాల

నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు

ఆర్ఎక్స్ హండ్రెడ్ తో యూత్ లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా నటించిన సినిమా గుణ 369. అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. కార్తికేయకు ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుందని చాలామంది చెప్పుకున్నారు. మొత్తంగా సినిమా శుక్రవారం విడుదలైంది.

కథగా చెబితే ఒంగోలుకు చెందిన ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు. బాధ్యతగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఓ రోజు గీత అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమను గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు ఇదే ఊర్లో గద్దలకుంట రాధ అనే రౌడీ ఉంటాడు. మొత్తంగా గుణ తన లైఫ్ హ్యాపీగా ఉంది అనుకుంటోన్న టైమ్ లో ఆ రౌడీ హత్యకు గురవుతాడు. అంతకు మించి ఆ కేస్ గుణపై పడుతుంది. జైలుకు వెళతాడు. మరి రాధ అనే రౌడీని చంపింది ఎవరు..? ఆ కేస్ గుణపై ఎందుకు పడింది..? దీని వెనక ఉన్నది ఎవరు..? గుణ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

ఏ సినిమాకైనా ఓ గ్రాఫ్ ఉంటుంది. మెల్లగా మొదలైనా ఆ గ్రాఫ్ పైకి వెళ్లాలి. అంటే సీన్ బై సీన్ నెక్ట్స్ లెవెల్ కు వెళితేనే ఆడియన్స్ కొత్తదనం ఫీలవుతారు. ఇలాంటి ఫీల్ తేవడంలో దర్శకుడు అర్జున్ జంధ్యాల మాగ్జిమం సక్సస్ అయ్యాడు. అయితే సినిమా టేకాఫ్ సూపర్బ్ గా ఉన్నా.. ప్రేమకథ కాస్త వీక్ గా ఉండటం ఇబ్బంది పెడుతుంది. బట్.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అప్పటి నుంచి అద్భుతమైన ట్విస్ట్ లతో ఔరా అనిపించే మలుపులతో దర్శకుడు తన టాలెంట్ అంతా చూపించాడు. ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఖచ్చితంగా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో కంప్లీట్ కమర్షియల్ సినిమాలో ఇన్ని ట్విస్ట్ లు రాలేదంటే అతిశయోక్తి కాదు. అలాగని ఇవేవీ ఏదో కావాలని పెట్టినట్టుగా కాకుండా దర్శకుడు తను రాసుకున్న కథను ఖచ్చితంగా ప్రెజెట్ చేసేలా కనిపిస్తాయి. ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం.. ప్రేక్షకులుకు అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాల సినిమా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. చనిపోయిన విలన్ పాత్ర చుట్టూ రాసుకున్న కథ.. దానికి అద్భుతమైన కథనం వెరసి గుణ 369 ను ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా మార్చేసింది. ఇదే సినిమాకు అతి పెద్ద బలం.

ట్విస్ట్ లు కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఆడియన్స్ కు పండగే. గుణ369తో కార్తికేయ తను మాస్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. అతని నటనే సినిమాకు హైలెట్. ఫస్ట్ హాఫ్ లో క్యాజువల్ గా.. సెకండ్ హాఫ్ లో హై ఎమోషన్స్ పండించిన కుర్రాడిగా కార్తికేయ అదరగొట్టాడు. హీరోయిన్ అనఘా సింప్లీ సూపర్బ్. నటన, గ్లామర్ రెండూ ఆకట్టుకున్నాయి. రాధ పాత్రలో నటించిన ఆదిత్య మీనన్ చాలా ప్లస్ అయ్యాడు. అలాగే రంగస్థలం మహేష్ పాత్ర ఊహించని విధంగా కనిపిస్తుంది. మొత్తంగా టెక్నికల్ గానూ బ్రిలియంట్ అనిపించుకున్న గుణ 369 ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతిని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

-k.బాబురావు

Tags

Read MoreRead Less
Next Story