బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు..

పశ్చిమ బంగాల్‌కు ఆనుకుని ఉన్న బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో 76 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తం ఉంది. నైరుతు రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి..

మరో మూడ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలోని మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి అటు తీరం వెంబరడి గంటకు 45-50 కి.మీ వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ఎగువన కురుస్తున్నవర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 14వేల 683 క్యూసెక్కులు కాగా... అవుట్‌ ఫ్లో 17వందల 99 క్యూసెక్కులు. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 16వందల 33 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 16వందల 03.57 అడుగులు. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం వంద టీఎంసీలు కాగా... ప్రస్తుతం 24.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది..

Tags

Read MoreRead Less
Next Story