ఆన్‌లైన్‌లో కిడ్నీ సేల్స్..!

ఆన్‌లైన్‌లో కిడ్నీ సేల్స్..!

ఇడ్లీల తరహాలో కిడ్నీలను ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టిందో ముఠా. ఆ రాకెట్‌ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. కిడ్నీసేల్స్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నకిలీ డాక్యుమెంట్లు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడులోని మధురైకి చెందిన సూర్య శివరాం అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్‌లైన్‌లో కిడ్నీ సేల్స్ మొదలుపెట్టాడు. కిడ్నీ డోనర్స్, బయ్యర్స్ నెట్‌వర్క్ పేరుతో అప్‌లోడ్ చేశాడు. కిడ్నీలు అవసరమైన వారు అతడిని సంప్రదిస్తే.. రిజిస్ట్రేషన్ పేరుతో 15 వేలు వసూలు చేస్తాడు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని సగం డబ్బు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆపరేషన్ తర్వాత మిగతా 50 శాతం డబ్బు ఇవ్వాలని క్లయింట్లకు చెప్పి కోట్లు వసూలు చేశాడు సూర్యశివరాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయిస్తానంటూ ఫేక్ సర్టిఫికెట్లతో డబ్బు వసూలు చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు.

మల్కాజిగిరి SOT పోలీసులకు సూర్య శివరాం సమాచారం తెలీడంతో నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కిడ్నీలు అమ్మడం, కొనడం నేరమన్న పోలీసులు.. ఇలాంటి రాకెట్లు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story