కృష్ణానదికి స్థిరంగా వరద.. మళ్ళీ గేట్ల ఎత్తివేత

కృష్ణానదికి స్థిరంగా వరద.. మళ్ళీ గేట్ల ఎత్తివేత

కృష్ణా నదికి వరద స్థిరంగా కొనసాగుతోంది.. కర్నాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది.. జూరాలకు ఇన్‌ఫ్లో 81వేల క్యూసెక్కులుగా నమోదవుతోంది.. దీంతో ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరదనీరు వస్తోంది.. దీంతో శ్రీశైలం ఒక గేటు ద్వారా నీటిని సాగర్‌కు విడిచిపెడుతున్నారు.. ఇక నాగార్జున సాగర్‌ ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 32వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.. ఈ నీరంతా ప్రకాశం బ్యారేజ్‌లోకి వదిలిపెడుతున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర లక్షా 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. అంతే మొత్తాన్ని సముద్రంలోకి వదులుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story