మార్షల్ మూవీ రివ్యూ

మార్షల్ మూవీ రివ్యూ

టైటిల్‌ : మార్షల్

నటీనటులు : అభయ్, మేఘా చౌదరి, శ్రీకాంత్, సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్, తదితరులు.

దర్శకత్వం : జై రాజసింగ్

నిర్మాత‌లు : అభయ్ అడకా

సంగీతం : యాదగిరి వరికుప్పల

సినిమాటోగ్రాఫర్ : స్వామి ఆర్ యమ్

స్క్రీన్ ప్లే : జై రాజసింగ్

మార్షల్ ఈ టైటిల్ వినగానే రెగ్యులర్ సినిమా కాదు అనే భావన ఇట్టే కలుగుతుంది. జై రాజాసింగ్ దర్శకత్వంలో అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించారు. ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి రీ రికార్డింగ్ అందించిన ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందో చూద్దాం..

కథ :

శివాజీ (శ్రీ కాంత్) ఒక సూపర్ స్టార్. శివాజీకి ఉన్న లక్షల మంది ఫ్యాన్స్ లో అభి (అభయ్) ఒకడు.

అభి కి తన అక్క అంటే ప్రాణం. సంతానం కలగడం లేదని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ ట్రీట్మెంట్ ఫెయిల్ అయి అక్క కోమా లోకి వెళ్తుంది. అభీని ఒక బ్యూటీ ప్రొడక్ట్ సేల్ విషయం లో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ రెండు సంఘటనలకు కారణం హీరో శివాజీ అని తెలుసుకుంటాడు అభి. తను అభిమానించిన హీరో నిజ జీవితంలో విలన్ అయితే ఒక అభిమాని చేసే పోరాటం ఎలా ఉంటుంది అనేది మిగిలిన కథ..? అసలు శివాజీ ఎందుకు అలా చేస్తున్నాడు. మెడికల్ క్రైమ్ కి శివాజీ కి ఉన్న లింక్ ఏంటి...?

కథనం :

కొత్తదనం నిండిన కాన్సెప్ట్ లకు పెద్ద స్టార్ క్యాస్ట్ అవసరం లేదని చాలా సినిమాలు నిరూపించాయి. ఆ కోవలో నిలిచే చిత్రం మార్షల్. పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగే దంపతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతి ఏరియా లో ఈ హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి. ఈ సమస్య ని ఇతివృత్తంగా తీసుకున్న మార్షల్ ఐడియా చాలా ఆసక్తి గా ఉంది. కాన్సెప్ట్ ని కథ గా మలచడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అభయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అన్ని రకాల షేడ్స్ ఉండే పాత్ర ను సమర్థవంతంగా పోషించాడు. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఫ్యాన్ హీరో రిలేషన్- మెడికల్ క్రైమ్స్ మధ్య ఫ్యామిలీ స్టోరీ ఇమిడి పోయింది. హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ని ప్లే చేసాడు. ఆ పాత్రకు ఒక జర్నీ ఉంటుంది. స్టూడెంట్ నుండి సూపర్ స్టార్ వరకూ... ఆ జర్నీ లో సైంటిస్ట్ గా ఆ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదు. ఆ పాత్ర ట్రావెల్ చేసే విధానం ఉత్కంఠగా ఉంటుంది. ఇక మెడికల్ మాఫియా పై వచ్చిన సినిమాల్లో మార్షల్ కూడా ఒక రిఫరెన్స్ గా మిగులుతుంది. మేఘా చౌదరి అందంగా ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లవ్ స్టొరీ కి పెద్ద స్కోప్ లేక పోయినా ఉన్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి అందించిన రీ రికార్డింగ్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తోంది. ఎడిటింగ్ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా :

ఎమోషనల్ గా సాగే థ్రిల్లర్.

-కుమార్ శ్రీరామనేని

Also watch :

Tags

Read MoreRead Less
Next Story