అవకాశాలు లేక అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి నటి..

సినిమా హీరోయిన్లను చూసి తానూ నటినవ్వాలనుకుంది. అమ్మ వద్దని వారిస్తున్నా పంజాబీ అమ్మాయి పెర్ల్ ముంబై ట్రైన్ ఎక్కింది. అవకాశాల కోసం ఎన్నో ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఏవో చిన్నా చితకా కేరెక్టర్లు తప్పించి మెయిన్ కేరెక్టర్లు గానీ, కనీసం సెకండ్ హీరోయిన్‌గానైనా అవకాశం రాలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాం.. ఇదిగో అదిగో అంటూ చాలానే డబ్బు గుంజుకున్నారు. ఈ విషయంలో తల్లికీ, తనకీ పలు సార్లు గొడవలు జరిగేవి. సినిమా అంత మంచి ఫీల్డ్ కాదు వద్దని పదే పదే తల్లి చెప్పడం తనకి నచ్చేది కాదు. బతుకైనా చావైనా అందులోనే అనుకుంది. దీంతో మెంటల్‌గా బాగా డిస్ట్రబ్ అయింది. పలు మార్లు సూసైడ్‌కి ప్రయత్నించి, సమయానికి కుటుంబసభ్యులు గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది.

కానీ ఈసారి ఆమె నివసిస్తున్న ఒషివారాలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఉన్న కెన్ వుడ్ భవనం నుంచి దూకేయడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులుకు పెద్ద శబ్ధం వినిపించింది. మొదట పూల కుండీ ఏదైనా పడిపోయిందేమో అని అనుమానం వచ్చింది. దగ్గరకు వచ్చే సరికి రక్తపు మడుగులో పడిఉన్న యువతి కనిపించింది. పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువతి ఆత్మహత్యకు గల కారణాలు అన్వేషిస్తే.. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి సినిమాల విషయమై తల్లితో గొడవపడినట్లు తెలిసింది. అడగ్గానే అవకాశం ఇచ్చేస్తారనుకుని అమాయకంగా అమ్మమాట వినకుండా సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరైంది. కానీ ఏ ఒక్కరూ తనకు అవకాశం ఇవ్వకపోయేసరికి తను ఆశించినట్లు లేదని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *