వరంగల్ పోరళ్లనే కాదు రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను రఫ్పాడిస్తున్న’నభా నటేష్’

‘నన్ను దొచుకుందువటే’ తో తెలుగు ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో ఫిదా చేసిన నభా.. ఇస్మార్ట్ కి లైన్ మార్చి పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది. ట్రెండింగ్ లో దుమ్ములేపుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ లో హీరో తర్వాత నభా డైలాగ్ మోస్ట్ పాపులర్ అయ్యింది. లౌడ్ రోల్ లో కనిపిస్తున్న నభా ‘వరంగల్ పోరళ్లను’ నే కాదు రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసింది.
తెలుగు లో మాట్లాడటం.. యాక్టివ్ గా ప్రమోషన్స్ లో కనపడటం నభాకి అడ్వాంటేజ్ గా మారాయి. వరంగల్ బోనాల్ ఈవెంట్ లో నభా మాటలు ఎనర్జీ ని క్రియేట్ చేసాయి ‘ రొమాన్స్ లో యాక్షన్ ఉంది’లాంటి మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్ నెస్ ని పూర్తిగా ఎడాప్ట్ చేసుకొని తనను కొత్త గా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్ కి ఎట్రాక్షన్ గా మారింది. దిమ్మా కరాబ్ సాంగ్ లో నభా ఎక్స్ ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదనే టాక్ యూనిట్ లో వినిపిస్తుంది. మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ గాళ్ గా నభా తెలుగు హీరోయిన్స్ లో కొత్త గా కనిపిస్తుంది. థియేటర్స్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన నభా లోని ఎనర్జీ ప్లస్ యాక్టింగ్ టాలెంట్ కి దర్శకుడు పూరి కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ లో మాగ్జిమమ్ స్కోర్ చేయబోతున్న నభా తెలుగు ట్రెండీ హీరోయిన్స్ సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదు.

KUMAR SRIRAMANENI

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *