నటించడం మానేస్తున్నాను.. : నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా విషయం వుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బుల్లితెర యాంకర్‌గా రంగ ప్రవేశం చేసిన నిహారిక నటిగా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు. ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నీహారిక నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నటిగా గుడ్‌బై చెప్పినా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటానంటోంది ఈ క్యూట్ బేబీ. ఇప్పటికే తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఇదే బ్యానర్‌పై సినిమాలు కూడా చేయాలని నిర్ణయించుకుంది ఈ మెగా డాటర్. నిర్మాతగా తన తొలి చిత్రం మెగా హీరోతోనే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *