బంపరాఫర్.. ఏకంగా రూ.12,000 తగ్గిన మొబైల్

వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి మొబైల్ కంపెనీలు. నిన్నటి వరకు రూ.27,999ఉన్న నోకియా 8.1 ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.12,000లు తగ్గి 15,999కి వచ్చేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమోరీతో లభిస్తోంది. రూ.22,999కు 6 జీబీ+128 జీబీ వేరియంట్ ఫోన్ లభిస్తోంది. నోకియా ఆన్‌‌లైన్ స్టోర్‌లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8.1స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 8.1 ప్రత్యేకతలు.. 6.18 ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, 1080 x 2244 పిక్సెల్స్ డిస్‌ప్లే రిజల్యూషన్. 4జీబీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, 12+ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ +64 జీబీ- రూ. 15,999, 6జీబీ+128జీబీ-రూ.22,999.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *