పోలీస్ బాస్‌ని బుక్ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్

పోలీస్ బాస్‌ని బుక్ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్

జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది. రెండు మనసుల కలయిక.. మూడుముళ్ల వేడుక.. ఏడడుగుల అనురాగ బంధం. పెళ్లికంటే ముందే ప్రీ వెడ్డింగ్.. తాళాలు, తలంబ్రాలు ఉండవు.. చిలిపి సంగతులు.. స్వీట్ మెమరీస్.. వీడియోల్లో బంధించి ఆ తీపి జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరువేసుకుంటూ.. ఆ పాత మధురాలను అప్పుడప్పుడూ తలచుకుంటూ.. అందుకే ఆ షూట్ అంత ఫేమస్ అయిపోయింది. పోలీస్ బాస్ ఖాఖీ దుస్తులు వేసుకుని కరకుగా కేసుల విషయంలో ప్రవర్తిస్తారేమో కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అతడు కూడా ఐసైపోతాడు. కానీ అతడు తీయించుకున్న ఈ షూట్ ఫేమస్ అవుతుందనుకున్నారు.. ఈ విధంగా ఫేమస్ అవుతుందని అనుకోలేదు. డిపార్ట్‌మెంట్ నుంచి పెళ్లికి ముందే అక్షింతలు పడతాయని అస్సలు అనుకోలేదు.

రాజస్థాన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్న ఓ జంటకు పోలీసుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే అంతలోనే పోలీసు అధికారులను అవమానించేలా షూట్ ఉందంటూ నోటీసులు ఇచ్చారు. చిత్తోర్‌ఘర్ జిల్లాకు చెందిన ధనపాట్ అనే పోలీస్ అధికారికి కిరణ్ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. తమ ప్రీ వెడ్డింగ్ వెరైటీగా ఉండాలని ఓ షూట్ చేయించుకున్నారు. అందులో ధన్‌పాట్ పోలీస్ డ్యూటీలో ఉంటారు. కిరణ్ ఓ రోజు స్కూటీపై హెల్మెట్ లేకుండా వస్తుంది. అది చూసిన పోలీస్ ఆమెను ఆపి ఫైన్ కట్టమంటారు. అతడి చేతిలో రూ.500 ల నోటు వుంచి వెనుక జేబులో ఉన్న పర్స్ కొట్టేస్తుంది. పర్స్ కొట్టేసిన విషయాన్ని పోలీస్ గమనించుకోరు.

ఊహల్లోనించి బయటకు రాగానే అసలు విషయం తెలుస్తుంది. తర్వాత ఇద్దరి మనసులు కలుసుకుంటాయి. ప్రేమ భావనలో విహరిస్తాయి. ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ వీడియో హాయిగా సాగిపోతున్న తరుణంలో.. పోలీస్ డిపార్ట్‌మెంట్ కంటికి అమ్మాయి దగ్గర రూ.500 లంచం తీసుకోవడం తప్పుగా కనిపించింది. పోలీస్ డ్రెస్‌లో ఉండి ఇలాంటి వీడియోలు చేస్తే డిపార్ట్‌మెంట్‌ని అవమానించినట్టే.. దీనిద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు అని ధన్‌పాట్‌పై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story