ఆయనతో లంచ్ చేయాలంటే రూ.24 కోట్లకు పైగా చెల్లించాల్సిందే..

కాఫీ డేల్లోనే కథలు తయారవుతాయి. ఆ డిస్కషన్ ఓ మంచి సినిమాగా రూపు దిద్దుకుంటుంది. లంచ్ మీటింగ్స్ ఓ స్టార్టప్ కంపెనీకి ప్రేరణ అవుతుంది. మరి పట్టిందల్లా బంగారమే అయి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన వారెన్ బఫెట్‌తో లంచ్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆయన ఓ మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు.

మనసున్న మంచి మనిషి కూడా. అందుకే తన సంపాదనలో 99 శాతం సమాజానికే ఉపయోగిస్తారు. ఆయనతో లంచ్ చేయడం ఓ అదృష్టమైతే.. ఆయన బిజినెస్‌కు సంబంధించిన మెళకువలు ఎంతో విలువైనవి. అందుకే అంత ఖర్చుపెట్టడానికి వెనుకాడరు. మీతో లంచ్‌ మీటింగ్ అప్పాయింట్‌మెంట్ ఎప్పుడిస్తారు లాంటివి కాదండోయ్. బఫెట్‌తో లంచ్ అంటూ ఓ ఆక్షన్ (వేలం పాట) నిర్వహిస్తారు. అందులో ఎంత ఎక్కువ డబ్బుకి ఎవరు బిడ్ వేస్తారో వారినే ‘లంచ్ విత్ బఫెట్’ అవకాశం వరిస్తుంది. అయాతే బిడ్ వేసిన వారితో కూడా 7గురిని తీసుకెళ్లవచ్చు.

వారు కూడా బఫెట్‌తో లంచ్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఈనెలాఖరు అంటే మే 31 వరకు జరిగే వేలం పాటలో ఇప్పటికే రూ.23 కోట్లు చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు. ఇంకా మూడు రోజులుంది కదా అప్పటి వరకు ఆక్షన్ సాగుతూనే ఉంటుంది. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి రూ.22 కోట్లు చెల్లిస్తే, 2012లో మాత్రం ఒకరు ఏకంగా రూ.24 కోట్లు చెల్లించారు. ఎదుకండీ అంత డిమాండ్ అంటే.. మరి ఆయన చెప్పే గోల్డెన్ సూత్రాలు, వజ్రాల్లాంటి మాటలు అంతకంటే విలువైనవి.

అందుకే ఆయనతో లంచ్ కోసం క్యూ కట్టేస్తుంటారు ప్రముఖులంతా. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులన్నీ వారెన్ బఫెట్ ధాతృత్వ సంస్థ అయిన గ్లైడ్ ఫౌండేషన్‌కు వెళ్తాయి. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్‌కు ‘పవర్ లంచ్’ పేరుతో నిర్వహించే ఈ లంచ్ ద్వారా రూ.208 కోట్లు అందించారు బఫెట్. ఈ సారి లంచ్ న్యూయార్క్‌లోని స్మిత్ అండ్ వోలెన్‌స్కీ స్టీక్‌హౌజ్‌లో ఉంటుంది. ఇది అత్యంత ఖరీదైన రెస్టారెంట్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *