అసోం బియ్యం.. వండకుండానే వడ్డించేయొచ్చట!!

అసోం బియ్యం.. వండకుండానే వడ్డించేయొచ్చట!!

అన్నం వండకుండా ఎలా తింటారు. అలా బియ్యం తినేస్తే రుచీ పచీ ఎలా తెలుస్తుంది. అందులో కూరలు ఎలా కలుపుకుంటాము. ఇలాంటి అనుమానాలెన్నో. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టేస్తూ ఈ బియ్యం మార్కెట్లోకి రాబోతున్నాయి. ఓ గంట నీళ్లలో నానబెడితే చాలు అన్నం తయారవుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి అసోంలో ఈ కొత్తరకం బియ్యాన్ని పండిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దేశంలోని అందరికీ ఈ బియ్యం అందుబాటులోకి రానున్నాయి. వీటిని మట్టిబియ్యం లేదా బోకా సౌల్ అంటారు. వండకుండానే అన్నంలా తయారవుతుంది కాబట్టి ముద్దుగా మ్యాజిక్ రైస్ అని కూడా పిలుస్తుంటారు. అసోంలోని కొండ ప్రాంతాల్లో పండించే ఈ వరి రకం.. నల్బరి, బార్పేట, గోల్పారా, కమ్రప్, దరాంగ్, ధుబ్రీ, చిరాంగ్, బొంగాయాగోవాన్, కొక్రాజార్, బక్సా మొదలైనవి. వీటిని పండించడానికి జూన్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలమైన నెలలు అని అంటున్నారు రైతన్నలు.

చన్నీళ్లలో ఓ గంట నానబెడితే చాలు అన్నం తయారైపోతుందట. మనం రోజూ తినే అన్నంలానే ఇదికూడా ఉంటుంది. ఎలాంటి పురుగు మందులు వేయకుండానే ఈ పంటను పండించవచ్చని రైతులు స్పష్టం చేశారు. అసోం రాష్ట్ర ప్రజలు పండుగలు, ఫంక్షన్లలో ఈ బియ్యాన్నే వాడుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ణానంతో తయారైన ఈ రకం వంగడాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారు. 17వ శతాబ్ధంలో సైనికులు ఈ బియ్యంతో తయారైన అన్నానే తినేవారట. గువాహటి యూనివర్శిటీ పరిశోధనల్లో బోకా సౌల్ బియ్యం విశిష్టతను వివరించారు. ఈ బియ్యంలో పీచు పదార్థం 11 శాతం, మాంసకృత్తులు 7 శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇక వండడానికి కూడా కుక్కర్లతో పన్లేదు. ఓ గంట నానబెడితే చాలు హ్యాపీగా తినేయొచ్చు. పైగా ఈ అన్నం తింటే శరీరంలో వేడి కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story