మోదీ అమెరికా సభకు విశిష్ట అతిథి!

మోదీ అమెరికా సభకు విశిష్ట  అతిథి!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. యూఎస్ టూర్‌లో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఈ నెల 22న హ్యూస్టన్ నగరంలో ఎన్‌ఆర్‌ఐలతో మోదీ భేటీ కానున్నారు. టెక్సాస్ ఇండియా ఫోరం హౌడీ మోదీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కోసం NRIలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హ్యూస్టన్ నగరాన్ని మోదీ మేనియా కమ్మేసింది. NRG స్టేడియంలో జరిగే ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి 50 వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఓ విదేశీ నాయకుడు పాల్గొనే కార్యక్రమానికి ఉత్తర అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతుండడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంటున్నారు.

అలాగే మోదీ-హౌడీ కార్యక్రమానికి విశిష్ట అతిథి హాజరుకానున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయనతో పాటు 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. మోదీ-ట్రంప్‌ ఒకే వేదిక నుంచి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారని తెలుస్తోంది. ఇదే వేదికపై ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య విబేదాలకూ తెరపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు 2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలించే అంశాలుగా అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం వల్ల కశ్మీర్‌ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్‌పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ట్రంప్‌, మోదీ భేటికి సంబంధించి వైట్‌హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, మోదీ-హౌడీ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇండో-అమెరికన్ ముస్లింలు కూడా కృషి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story