పులిచింతల ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద ఉధృతి

పులిచింతల ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద ఉధృతి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వదరలతో ఏపీలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పులిచింతల ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతుండడంతో 22 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం పులిచింతల ఇన్‌ ఫ్లో 5.46 లక్షల క్యూ సెక్కులు ఉంది. ఔట్‌ ఫ్లో 6.16 క్యూ సెక్కులు ఉంది. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి ప్రవాహం 39.459 టీఎంసీలకు చేరింది.

కృష్ణమ్మ పరుగులతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్టుకు 5.46 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా. సుమారు 4 లక్షల క్యూ సెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ప్రకాశం బ్యారేజ్‌ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు ఇంతలా‌ జలకళ సంతరించుకోవడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.. కృష్ణమ్మ గలగలలను చూసి తన్మయత్వం చెందుతున్నారు.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి ప్రవాహం 197గా ఉంది. 8.80 లక్షల క్యూ సెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా.. ఔట్‌ ఫ్లో 7.23 లక్షల క్యూ సెక్కులు నమోదవుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొంత మేర తగ్గినట్లే కనబడుతోంది. అయినా ప్రస్తుతం వస్తున్న వరద నీరును.. నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు అధికారులు.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 25వేల క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా 70వేల క్యూసెక్కులు, పది గేట్ల ద్వారా నీటిని సాగర్‌కు విడిచిపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story