రాక్షసుడు మూవీ రివ్యూ

రాక్షసుడు మూవీ రివ్యూ

విడుదల తేదీ : ఆగస్టు 02, 2019

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, రాధా రవి.

దర్శకత్వం : రమేష్ వర్మ

నిర్మాత‌లు : సత్యనారాయణ కోనేరు

సంగీతం : జిబ్రాన్

సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్

ఎడిటర్ : అమర్ రెడ్డి

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కి ఉండే మాస్ ఇమేజ్ కి భిన్నమైన కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాటసన్ గా తమిళంలో సర్ ప్రైజ్ హిట్ సాధించిన మూవీ ని తెలుగు లో రాక్షసుడిగా రీమేక్ చేసారు. హిట్ ని రిపీట్ చేయడంలో టీం ఎంత వరకూ సక్సెస్ అయ్యిందోచూద్దాం...

కథ:

అరుణ్ ( బెల్లంకొండ సాయిశ్రీనివాస్) దర్శకుడు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. తన ప్రయత్నాలు కు ఎక్కడా ఆదరణ లభించకపోవడంతో ఫ్యామిలీ కోసం తండ్రి పోలీస్ ఉద్యోగం తీసుకునేందుకు అంగీకరిస్తాడు. అతను డ్యూటీలోకి చేరిన తర్వాత ఒక హాత్య అతన్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి హాత్యల గురించి అతను దర్శకుడిగా ప్రయత్నించే టప్పుడు ఒక రీసెర్చ్ చేస్తాడు. అదే విధంగా మరో హాత్య జరుగుతుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో అతను జూనియర్ కావడంతో అతని మాటలకు పెద్ద విలువ ఉండదు. అతను ఆ హాత్య ల వెనక ఉన్న వ్యక్తి ని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు కొనసాగుతుండగా అరుణ్ మేనకోడలు కూడా హాత్య గురౌతుంది. మరి అరుణ్ ఆ హాత్యలను ఎలా చేధించాడు. అతను ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిప్పాయి..? ఇంతకీ ఆ హాత్యల వెనక ఉన్నది ఎవరు..? అనేది మిగిలిన కథ..?

కథనం:

తమిళంలో సర్ ప్రైజ్ హిట్ ని సాధించిన రాటసన్ ఒక పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా కుండే పెద్ద బలం రియలిస్టిక్ అనిపించే హీరోయిజం. ఇప్పటికే మాస్ హీరోగా ఎలివేట్ అయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ కథను ఎంచుకోవడమే విజయానికి బాటలు వేసింది.దర్శకుడు అవ్వాలనే ప్రయత్నంలో విసిగిపోయి కుటుంబ భారం మోసేందుకు పోలీస్ గా మారిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటన పాత్రోచితంగా ఉంది. పోలీస్ గా మారాక అతనికి ఎదురైన ఒక హాత్య అతనికి చాలా ప్రశ్నలను వేస్తుంది. ఆ తర్వాత హాత్యతో ఈ హాత్యల వెనక ఉన్న ప్యాట్రన్ ని గుర్తిస్తాడు. అక్కడి నుండి కథనం వేగం అందుకుంటుంది. నెక్ట్స్ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎదురయ్యే ప్రతి సవాల్ ని రియలిస్టిక్ గానే ఎదుర్కొంటాడు. థ్రిల్లర్ మూవీస్ కుండే బిగిని తగ్గకుండా ఆ కథ తాలూకు మూడ్ ని ఎక్కడా డైవర్ట్ కాకుండా సినిమాటోగ్రఫీ తో అరెస్ట్ చేసాడు వెంకట్ సి దిలీప్. ర్యాంకుల కోసం పడే ఒత్తిడి పిల్లలను ఎలాంటి అగాధాలకు తోస్తుంది అనేది మార్కుల పెంచుతానని ఒక టీచర్ చేసే దారుణమైన చర్యలలో కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో థ్రిల్లర్స్ ని మిక్స్ చేయడం అనేది అరుదుగా జరిగుతుంది. అది ఈ కథలో చాలా బాగా కుదిరింది. హీరో మేనకోడలు చనిపోయినప్పుడు దర్శకుడు వేసిన కట్ షాట్స్ హృదయాన్ని కదిలించి వేస్తాయి. ఆ సీన్ లో రాజీవ్ కనకాల, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటన వారి కెరియర్ లో గుర్తుంచుకునే సన్నివేశంగా మిగిలిపోతుంది. ఈసినిమాలో సెకండ్ హీరో జిబ్రన్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్ ని తన మ్యూజిక్ ఒక మూడ్ లోకి తీసుకెళ్ళాడు. కిడ్నాపర్ కనిపించినప్పుడు అతను ప్లే చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత సినిమా గడిచాక ఆడియన్ కి తెలయకుండా భయాన్ని కలిగిస్తుంది. అంతగా మ్యూజిక్ తో కథలోని ఎమోషన్స్ ని పలకించాడు. అనుపమ పరమేశ్వరన్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నమైన పాత్రలో కనిపించింది. అనుక్షణం అవరోధాలు ఎదురౌతున్నా, వెతుకుతున్న హాంతకుడు అనుకున్న దానికంటే ప్రమాదకరం అని ప్రతి మలుపులోనూ అర్దం అవుతున్నా హీరో పడే స్ట్రగుల్ ఆడియన్స్ ని అతనితో ట్రావెల్ చేపిస్తుంది. బాసిజం పోలీస్ వ్యవస్థలో ఎంతలా ఉంటుందో కూడా ఈకథలో కనిపిస్తుంది. ఒక అధికారి పై కాశీ విశ్వనాథ్ ఎదురు తిరిగే సందర్బంలో సగటు ప్రేక్షకుడు చప్పట్లు కొడతాడు. ప్రత్యర్ధిని తక్కువుగా అంచనా వేయడం ఎప్పుడూ మంచిది కాదనే విషయం ప్రతి సందర్భంలోనూ దర్శకుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. యాక్షన్ హీరో అనే ట్యాగ్ లైన్ ని బ్రేక్ చేసి నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెప్పించాడు. థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి రాక్షసుడు తప్పక చూడాల్సిన చిత్రం.

చివరిగా:

ఎక్కడా రిలాక్స్ కానివ్వని రాక్షసుడు.

- కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story