ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో.. ఇప్పుడు స్టూడియోలో.. గొంతు సవరించిన బిచ్చగత్తె.. వీడియో

కడుపులో నాలుగు మెతుకులు పడితే కానీ ఆత్మారాముడు చల్లబడతాడు. అందుకోసం ఏ పనీ చేతకాదు. యాచక వృత్తిని చేపట్టి తనకు వచ్చిన పాటల్ని పాడుకుంటూ జీవనం వెళ్లదీస్తుంది. వచ్చే పోయే రైలు సౌండ్‌లో తన పాట పదిమందికైనా వినిపడకపోతుందా.. ఓ పదిరూపాయలు వస్తే ఆ పూటకి పస్తులుండే బాధ తప్పుతుందని ఆశగా ఎదురు చూసేది రేణూ మోండల్. కలయో నిజమో.. అర్థం కాని పరిస్థితి.. అలవోకగా పాడుతున్న ఓ పాట.. ఏక్ ప్యార్ కా నగ్మా హై.. రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఓ ప్రయాణికుడికి నచ్చింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె పాడుతున్నప్పుడు అతడు తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె పాటకు దేశమంతా ఫిదా అయింది. ఆమెకు అవకాశాలిస్తామంటూ ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. కట్టూ బొట్టూ, వస్త్రధారణను మార్చేశారు. స్టూడియోలో కూర్చోబెట్టి మైక్ ముందు పెట్టారు. అదే స్వరం మరింత మధురంగా వినిపించింది. ఆమెకు ఈ అవకాశం ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేషమ్మియా తాను తెరకెక్కిస్తున్నసినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. రేణూ స్టూడియోలో పాట పాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నా కొత్త చిత్రం కోసం రేణూ చేత ఓ పాట పాడించాను. కలల్ని సాకారం చేసుకోవాలంటే ధైర్యం,
పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే చాలు అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *