పల్లవి.. చైతూ కాంబినేషన్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్

పల్లవి.. చైతూ కాంబినేషన్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్

నాగ చైతన్య.. సాయి పల్లవితో మరో అద్భుతమైన ప్రేమకావ్యాన్ని సృష్టిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. శేఖర్ సినిమా ఓ అపురూప ఆణిముత్యం. పచ్చని పంట పొలాల్లో పారుతున్న సెలయేరులా ఉంటుంది ఆయన చిత్రం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అని అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ కి నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలు.

Tags

Read MoreRead Less
Next Story