ఖతార్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ఖతార్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

గల్ఫ్ దేశమైన ఖతార్ లోని అశోక హల్, ఇండియన్ కల్చరల్ సెంటర్ దోహలో శుక్రవారం తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రంజాన్, ఈద్_మిలాబ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రముఖ జానపద కళాకారిణి రేలారే రేలా గంగా ముఖ్య అతిథిగా హజరుకాగా ఖతార్ లోని భారత రాయబారి శ్రీ P.కుమారన్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి మౌనం పాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రజా ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో ఉందన్నారు గంగా. కళాకారులు పాడిన పాటలు ప్రజల్లో ఐక్యంగా పోరాడే స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులందరూ ఐక్యంగా ఉంటూ తెలంగాణ సంప్రదాయాన్ని ఇక్కడ చాటుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఉమ్మడి రాష్ట్ర పాలనా సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేపట్టిన ఉద్యమానికి సంఘిభావంగా ఖతార్ లో 2011 సంవత్సరంలో తెలంగాణ గల్ఫ్ సమితిని ఏర్పాటు చేశమాన్నారు ఖతార్ లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్. ప్రవాస కార్మికుల సంక్షేమాభివృద్ధి కోసం తెలంగాణ గల్ఫ్ సమితి వివిధ కార్యక్రమాలు చేపడుతూ వలస కార్మికులకు ఇక్కడ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కాగా ఉత్సవాల వేదికపై తెలంగాణ ప్రముఖ జానపద కళాకారిణి రేలారే రేలా గంగా ఉర్రూతలూగించేలా పాటలు ఉల్లాసాన్ని కలిగించాయి. తెలంగాణకు సంబంధించి ఆమె పాడిన పాటలు నూతన ఆలోచనా విధానాన్ని పెంపొందించేదుకు ఎంతగానో దోహదపడ్డాయని తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు గంగాను ఘనంగా సంత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఇండియా అంబాసడర్ P.కుమారన్ , ICBF అధ్యక్షుడు బాబురాజన్ , సలహారదారులు శ్రీధర్, బందారపు శోభన్ గౌడ్, ప్రమోద్,శ్రీకాంత్ , తెలంగాణ గల్ఫ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గుగ్గిల రవిగౌడ్ మరియు ప్రవాస కార్మికులు 500 మంది పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story