హాయ్ ఫ్రెండ్స్.. నా ఫాలోవర్లు 30 మిలియన్లు.. నా ఆదాయం రూ.20 లక్షలు

మీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నా.. ఎంతో తెలుసా ఒక్క పోస్టుకు రూ.20 లక్షలు.. చెయ్యాలండి.. ఏదో ఒకటి చెయ్యాలి. పనీ పాట లేకుండా ఖాళీగా కూర్చోకూడదు. మనకి నచ్చింది మనకి వచ్చింది ఏదో ఒకటి చేసి ఎవరి మీదా ఆధారపడకుండా సంపాదిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. పప్పీనే కదా నేనేం చేయగలను అని మా ఓనర్ నన్ను ఊరుకోపెట్టలేదు. అసలే అందంగా ఉంటాను కదా.. నా అందాన్ని మరింత ఇనుమడింపజేసే డ్రెస్‌లు, గాగుల్స్ లాంటివి పెట్టి కెమెరాతో క్లిక్ మనిపించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి చూసి మీరు.. ఇంకా బోల్డంత మంది లైక్‌లు కొట్టారు. దాంతో నా రేంజ్ మారిపోయింది. ఇంతకీ నాపేరేంటో చెప్పలేదు కదూ.. జిఫ్‌పామ్. కొన్నేళ్ల క్రితం క్యాటీ పెర్రీ మ్యూజిక్‌ వీడియోలో కనిపించిన కుక్కపిల్లను నేను. అది చూసి కుప్పలు తెప్పలుగా అభిమానులయ్యారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 9.2 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా ఫేస్‌బుక్ ట్విట్టర్ ద్వారా కూడా ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువే. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు ఆయా సంస్థలు నగదు చెల్లిస్తాయి. ఇప్పటి వరకు సెలబ్రిటీలు చేసిన పోస్టులకే ఆదాయం ఎక్కువ వస్తుందని అనుకునేవారు. మనుషులు మాత్రమే కాకుండా జంతువులతో ఏర్పాటు చేసిన అకౌంట్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇలా జంతువులతో ఏర్పాటు చేసే పేజీకి 20 వేల ఫాలోవర్లు ఉంటే ఒక్కో పోస్టుకు రూ.19,452 చెల్లిస్తారు. అలాగే 1.50 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఫాలోవర్లు ఉంటే రూ.2,92,130 లభిస్తాయి. ఆ విధంగా జిఫ్‌పామ్‌కి ఏకంగా 30 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మరి ఆదాయం రూ.20 లక్షలు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది.

 

View this post on Instagram

 

@jiffpomcutelife ????

A post shared by jiffpom (@jiffpom) on

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *