చిన్నారిని మింగిన బోరుబావి

చిన్నారిని మింగిన బోరుబావి

బోరు బావులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట బోరు బావిలో పడి అభం శుభం చిన్నారులు మరణిస్తూనే ఉన్నారు. ఎన్ని ఘటనలు జరిగన మార్పు రాదు. నోరు తెరిచిన బోరుబావులను మూసేయాలన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైన ఉండదు. వారి నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం. తాజాగా నెల్లూరు జిల్లాలో బోరుబావిలో పడ్డ ఓ చిన్నారి మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్ద పాలెం గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయారు. మొదట మూడేళ్ల చిన్నారి మోక్షిత బోరులో జారిపడిపోగా... ఆతరువాత నాలుగేళ్ల బాలుడు గోపిరాజు కూడా అందులో పడిపోయాడు. మోక్షిత 40 అడుగుల లోతులో చిక్కుకుపోగా...బాలుడు 15 అడుగు లోతులో ఇరుక్కుపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బోరుకు సమాంతరంగా జేసీబీతో తవ్వారు. రెండు గంటల పాటు శ్రమించి నాలుగేళ్ల బాలుడిని రక్షించారు.

అయితే 40 అడుగుల లోతులో పడిపోయిన బాలికను బయటకు తీయడానికి మరింత సమయం పట్టింది. అప్పటికే చిన్నారి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయింది. నాలుగు గంటల తరువాత బాలికను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ బాలున్ని కాపాడమన్న ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మోక్షిత ప్రాణాలు విడిచింది.

చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదం అలుముకుంది. సరదాగా ఆడుకుంటున్న చిన్నారి ఇలా బోరు బావిలో పడి చనిపోతుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విలపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల కోసం బోరు తవ్వి వదిలేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి రక్షణ చేపట్టకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story