టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : ఉద్యోగానికి ముప్పు

టిక్‌టాక్‌.. ఇప్పుడిదో వేలం వెర్రిగా మారిపోయింది.. ప్రతి ఒక్కరీ వ్యసనంగా మారింది.. ఒక పాటకో, డైలాగ్‌కు లిప్‌ మూమెంట్‌ ఇచ్చి, హావభావాలు ఒలికించి వీడియోలు తీసుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టిక్‌టాక్‌కు బానిసలవుతున్న వాళ్లే.. తాజాగా ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో నర్సుల టిక్‌ టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది..

వీరంతా మల్కన్‌గిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే నర్సులు.. పసిపిల్లల వార్డులో వీరిని విధులకే కేటాయించారు అధికారులు.. అయితే, చేయాల్సిన పనులను పక్కన పెట్టి టిక్‌టాక్‌తో కాలక్షేపం చేస్తున్నారు.. పసిబిడ్డలను ఎత్తుకుని ముద్దు పెడుతూ, బాలీవుడ్‌ పాటలకు లిప్‌ మూమెంట్‌ ఇస్తూ, ఫన్నీ డైలాగులు చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేశారు.. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలోకి ఎక్కడంతో రచ్చ అవుతోంది. నందినీ రే, రూబీ రే, తపసీ బిస్వాన్‌, జ్యోతి రే అనే నర్సుల ఉద్యోగాలకే ఎసరొచ్చి పడింది..

ఈ వీడియోలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులకు షోకాజు నోటీసులు జారీ చేశారు.. ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ తెలిపారు. దర్యాప్తు తర్వాత అవసరమైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *