వారికి టార్గెట్‌ పెట్టిన మంత్రి కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టిపెట్టారు టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. రెండోసారి మంత్రి పదవి చేపట్టిన ఆయన తొలిసారి తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు గులాబీదళం ఘనస్వాగతం పలికింది. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు..

అనంతరం పార్టీ మున్సిపల్ ఇన్‌ఛార్జీలు, సెక్రటరీలతో సమావేశమయ్యారు కేటీఆర్‌. మున్సిపోల్స్‌ సన్నద్ధతపై నేతలతో రివ్యూ చేశారు. ఈ నెల 15 నుంచి మున్సిపల్‌ ఎన్నికల కార్యాచరణ రూపొందించిస్తున్నట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటిల్లో పార్టీ మండల, బూత్‌ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా… మున్సిపాలిటిల్లో ప్రస్తుత పరిస్థితిని హైకమాండ్‌ అందచేశారు ఇంచార్జులు. కొన్ని చోట్ల పార్టీ… గ్రూపులుగా విడిపోయిందని నివేదికలో తెలిపారు నేతలు. ఇక నుంచి ప్రతి నెల తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యరవర్గ సమావేశం జరుగుతుందన్న ఆయన…. అభ్యర్ధుల జాబితాలు సిద్ధం చేయాలని ఇంఛార్జీలకు ఆదేశించారు.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, గిరిజన శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తానికి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కేటీఆర్‌ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు టార్గెట్‌ పెట్టారు మంత్రి కేటీఆర్‌.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *