పాకిస్థాన్‌కు వంతపాడిన చైనాకు ఎదురుదెబ్బ

పాకిస్థాన్‌కు వంతపాడిన చైనాకు ఎదురుదెబ్బ

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మరోసారి షాక్ తగిలింది. దాయాదికి వంతపాడిన చైనాకు కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. కశ్మీర్ అంశంపై నేరుగా జోక్యం చేసుకోవడానికి ఐక్య రాజ్యసమితి భద్రతామండలి నిరాకరిం చింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ పాకిస్థాన్‌కే హితవు పలికింది. ఏకపక్షంగా వ్యవహరించవద్దని, సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెంచకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

కశ్మీర్ స్వయంపత్రిపత్తి రద్దుతో షాక్ తిన్న పాకిస్థాన్, ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకువెళ్లింది. చైనా మద్ధతు పలకడంతో భద్రతామండలిలో సీక్రెట్ మీటింగ్ జరిగింది. యూఎన్‌ఓలోని 5 శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. భారత్, పాకి స్థాన్‌ల నుంచి ప్రతినిధులు హాజరు కాలేదు. దాదాపు గంటపాటు సాగిన ఈ మీటింగ్‌లో పాకిస్థాన్‌కు పెద్దగా సపోర్ట్ లభించలేదు. చైనా మాత్రమే పాక్‌కు మద్దతిచ్చింది. మెజార్టీ సభ్య దేశాలు మనదేశానికే అండగా నిలిచాయి. దాంతో, చైనా కూడా వెనక్కి తగ్గింది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకో వాలని పేర్కొంది. రష్యా మాత్రం పూర్తిస్థాయి లో మనదేశానికి మద్ధతుగా నిలిచింది. సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం నడుచుకోవా లని పాకిస్థాన్‌కు స్పష్టంగా తేల్చిచెప్పింది.

కశ్మీర్ అంశంపై భద్రతామండలిలో చర్చ నిర్వహించడం గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిగా 1965లో కశ్మీర్ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. ఆర్టిక ల్-370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్ పెడబొబ్బలు పెట్టుకుంది. కశ్మీర్‌ విషయంపై స్పందించా లని అంతర్జాతీయ సమాజాన్ని బతిమాలుకుంది. ఐతే, అమెరికా-రష్యా, అరబ్ దేశాలు మనదేశానికే మద్ధతు పలికాయి. దాంతో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు చైనా మద్దతివ్వడంతో UNSCలో చర్చ జరిగింది. కానీ, ఇక్కడ కూడా దాయాదికి దెబ్బ తప్పలేదు.

Tags

Read MoreRead Less
Next Story