ఒక్కరోజు కోసం పెళ్లి..

ఒక్కరోజు కోసం పెళ్లి..

ఇదేం విడ్డూరం.. ఒక్కరోజు కోసం మీ బండి ఇస్తారా అని పక్కింటి వాళ్లను అడినట్టుంది. పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. జీవితాంతం కలిసి

ఉండడానికి చేసుకునే ఒప్పందం. మరి ఇదేంటి ఇక్కడ ఒక్క రోజు పెళ్లంటున్నారు.. కొంచెం ఆసక్తిగానే ఉంది కదా.. మరి దాని గురించి తెలుసుకుందాం..

ఇది నెదర్లాండ్ పర్యాటక శాఖ వారు తీసుకున్న నిర్ణయం. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో జనాభా సంఖ్య పది లక్షలు. కానీ అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే 19 మిలియన్ల మంది ఈ నగరాన్ని సందర్శించారట. మరో పదేళ్లలో ఈ సంఖ్య 29 మిలియన్ల మార్క్‌ని దాటనుందని అంచనా వేస్తున్నారు పర్యాటక అధికారులు. దీంతో తమ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువైపోతోందని, ఇది ఓవర్ టూరిజంకు దారితీస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారట. దీంతో అటు పర్యాటకులకు, ఇటు స్థానికులకు ఇబ్బంది లేకుండా 'ఆన్ టూరిస్ట్ గైడ్ టు ఆమ్‌స్టర్‌డ్యాం' పేరిట పర్యాటక శాఖ ఒక్క రోజు పెళ్లి అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. అంటే పర్యాటకులు స్థానికుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు ఒక్క రోజు కోసం. వారితోనే నగరం మొత్తం చుట్టి రావచ్చు. ఒకవేళ ఒకరికి ఒకరు నచ్చి జీవితాంతం కలిసి ఉంటామనుకుంటే కూడా లీగల్‌గా పెళ్లి చేసుకుని వారితోనే ఉండిపోవచ్చు. ఒక్కరోజు కోసం పెళ్లి చేసుకునే జంటల కోసం హనీమూన్ ప్యాకేజీలను కూడా కల్పిస్తోంది ఆమ్‌స్టర్‌డ్యాం పర్యాటక శాఖ. ఇష్టం లేకపోతే ఒకరోజు తరువాత వారికి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోవచ్చు. అదండీ ఒక్క రోజు పెళ్లి కథా.. కమామిషు.

Tags

Read MoreRead Less
Next Story