కుళాయి వద్ద గొడవ.. మహిళ మృతి

తాగునీటి కోసం కుళాయి వద్ద జరిగిన గొడవలో ఒక మహిళ మరణించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రంలోని పల్లివీధిలో పబ్లిక్ ట్యాప్‌ వద్ద తాతపు పద్మ, తెప్పల సుందరమ్మ మధ్య గొడవ మొదలైంది. మాటకుమాట పెరగడంతో ఇద్దరు ఘర్షణపడ్డారు. ఇద్దరు మహిళలు బిందెలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కొళాయి వద్ద ఉన్న నాచుపై కాలుజారి రోడ్డుకు తల బలంగా తగలడంతో తాతపు పద్మ అక్కడే చనిపోయింది. నీటికోసం జరిగిన గొడవలో పద్మ మరణించడంతో స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *