వామ్మో.. కిలో తేనె ఖరీదు లక్ష రూపాయలంట..

వామ్మో.. కిలో తేనె ఖరీదు లక్ష రూపాయలంట..

తియ్యగా ఉన్న తేనె అంటే ఇష్టపడని వారెవరు. పాపాయికి మాటలు త్వరగా రావాలంటే కాస్త నాలుక్కి తేనె రాయండి అంటారు. ఉదయాన్నే తేనె ఓ స్పూన్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇలా తేనె మనిషి జీవితంలో ఓ భాగమై పోయింది. మరి మార్కెట్లో దొరుకుతున్న రకరకాల తేనెలు.. అందులో అత్యంత ఖరీదైనవి.. మనుక, అకేషియా, లిండేన్, మిల్క్‌వీడ్, బ్లాక్‌బెర్రీ, క్లోవర్ వంటి పూల ద్వారా తేనెటీగలు సేకరించిన తేనెకు చాలా డిమాండ్ ఉంది. రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్దతుల్లో ఈ మొక్కలను పెంచుతారు. ఈ పూలనుంచి సేకరించిన తేనెకు రూ. 1 లక్షకు పైగా ఉంటుంది. ఇక వీటికంటే కూడా ఖరీదైన తేనె అంటే రాయల్ జెల్లీ. ఈ తేనె ద్రవ రూపంలో వుండదు. పేస్ట్‌లా ఉంటుంది. కిలో తేనెధర రూ.1.5 లక్షలకు పైనే ఉంటుంది. దీన్ని వాడితే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందట. అందుకే అంత రేటు అని చెబుతున్నారు.

మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే తేనె ఔషధ తయారీల్లో విరివిగా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాల్లో కూడా తేనెను విరివిగా వాడుతుంటారు. భారత్‌లో తేనెకు ఉన్న మార్కెట్ చూస్తే 2018లో రూ.1,560 కోట్లు ఉంటే అది 2024 నాటికి రూ.2,806 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాల సమాచారం.

తేనెటీగల జీవిత కాలం మూడు నుంచి ఆరు వారాలు.. తేనెటీగ తన జీవిత కాలంలో 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం 300 నుంచి 350 రకాల పూల నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది. ఇక తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్ సప్లిమెంట్స్, సౌందర్య సాధనాల్లో, ఔషధాల్లో వాడుతుంటారు.

Tags

Read MoreRead Less
Next Story